యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి

శివాజీపాలెం, (మద్దిలపాలెం) న్యూస్టుడే : యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
యాదవ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తనవంతు కృషిచేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా
శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్హాల్లో ఉత్తరాంధ్ర యాదవుల సమస్యలపై చర్చావేదిక కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో జయహో బీసీ సదస్సును నిర్వహిస్తున్న నేపథ్యంలో
ఉత్తరాంధ్రలో ఉన్న యాదవుల సమస్యలపై చర్చావేదిక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వ నామినెటెడ్ పదవుల్లో యాదవులకు స్థానం కల్పించాలని, గొర్రెల సహకార సంఘాలకు రుణ సదుపాయలు కల్పించాలని,
గొర్రెలకు వందశాతం ఇన్సూరెన్సు సదుపాయం కల్పించాలనే తదితర విషయాలు చర్చించుకున్నారు.
ఈనెల 30 అంకోశాలో ఉత్తరాంధ్ర జిల్లాల యాదవుల సంఘం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ
బి.రవిచంద్రయాదవ్ హాజరుకానున్నారన్నారు.
విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఒమ్మి సన్యాసిరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, బొట్టా వెంకటరమణ,
ఎం.రామలింగస్వామి, మొల్లి లక్ష్మణరావు, ఎస్.శ్రీనివాసరావు, దేవర సత్యనారాయణ,
బమ్మిడి ఉమ, ఎం.కృష్ణ, ఉత్తరాంధ్ర జిల్లాల యాదవులు పాల్గొన్నారు.