News

Realestate News

మెరుగైన విద్యాబోధనకు డిజిటల్‌ తరగతులు

మెరుగైన విద్యాబోధనకు డిజిటల్‌ తరగతులు

మెరుగైన విద్యాబోధనకు డిజిటల్‌ తరగతులు

జిల్లాలో రూ. 4.5 కోట్లతో ఏర్పాటు

 

లాలంకోడూరు (రాంబిల్లి), న్యూస్‌టుడే:మెరుగైన విద్యాబోధనకు డిజిటల్‌ తరగతులు

విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడం కోసం డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేశామని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త

సంచాలకులు (ఆర్‌జేడీ) డి.దేవానందరెడ్డి చెప్పారు.

మండలంలో భోగాపురం, వీఆర్‌.అగ్రహారం ప్రాథమిక పాఠశాలలు, వెంకటాపురం యూపీ, లాలంకోడూరు ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

లాలంకోడూరు ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులను పూర్తయిన పాఠ్యాంశాలపై ప్రశ్నించి వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడం కోసం విశాఖ జిల్లాలో 300 ఉన్నత పాఠశాలల్లో సుమారు రూ.4.5 కోట్లతో డిజిటల్‌

ఏర్పాటు చేశామన్నారు.

ఒక్కో డిజిటల్‌ తరగతికి రూ.1.50 లక్షలు ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు.

వర్చువల్‌ తరగతుల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.

ఇందులో భాగంగా అయిదు జిల్లాలో వర్చువల్‌ తరగతులకు సంబంధించిన స్టూడియోలు సిద్ధం అయ్యాయని ఆయన చెప్పారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన స్టూడియోల నుంచి లైవ్‌ ద్వారా సంబంధిత పాఠశాలల విద్యార్థులకు బోధన జరుగుతుందన్నారు.

విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అమలు చేస్తున్న చిట్టిచేతులు-చక్కటిరాతలు కార్యక్రమం అమలుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించామన్నారు.

అనంతరం డిజిటల్‌ బోధన, విద్యార్థుల సామర్థ్యాలపై స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.

విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాటించాల్సిన అంశాలను ఆయన వివరించారు.

కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి మళ్ల సూర్యారావు,

లాలంకోడూరు ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo