గాజువాక, న్యూస్‌టుడే: పెదగంట్యాడ గ్రామీణ మండలం నడుపూరు రెవెన్యూ పరిధిలో 270 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ టెక్నాలజీ పార్కు(వైద్య పరికరాల తయారీ పార్కు) ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ పరిశీలించారు, రెండు సర్వే నెంబర్లలో ఉన్న ఈ మొత్తం స్థలాన్ని పార్కుకు వినియోగిస్తున్న దృష్ట్యా అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి వచ్చారు. కొంత స్థలం రైతుల ఆధీనంలో ఉండడంతో వారికి నష్టపరిహారం అందించే విషయమై సమీక్షించారు. ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీవీఎంసీ, రెవెన్యూ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.