News

Realestate News

మెగా సంబరం…రంగస్థలం

మెగా సంబరం…రంగస్థలం
– న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం
విశాఖ సాగర తీరం ఆదివారం మెగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. రంగస్థలం చిత్రం ప్రీ ఆడియో రిలీజ్‌ ఆర్‌కె బీచ్‌లో జరగడంతో అభిమానులు పోటెత్తారు. రామ్‌చరణ్‌, చిరంజీవి కుటుంబ సభ్యులు దీనికి హాజరవడంతో నగరం నుంచి భారీగా జనం తరలివచ్చారు. చిరంజీవి ఒక ఉత్తరాన్ని పోస్టు డబ్బాలో పోస్టు చేయగా ఆ ఉత్తరం రంగస్థలం గ్రామానికి చేరినట్లుగా చిత్రీకరించి ట్రైలర్‌ను ప్రదర్శించారు. సినిమా చిత్రీకరణ జరిగిన గ్రామంలోని వాతావరణం, సెట్టింగ్‌లను వేదికపై ఏర్పాటు చేసి గ్రామీణ వాతావారణాన్ని తలపింప చేశారు. చిత్రంలోని పాటలకు సత్యం నృత్య బృందం నాట్యం చేసి అలరించారు. హీరోయిన్‌ పూజాహెగ్డే వేదికపై స్వయంగా రంగమ్మ, మంగమ్మ పాటకు డ్యాన్స్‌ వేశారు. నిర్వాహకులు పాస్‌లు జారీ చేసినా అధికశాతం మందిని వేదికలోకి అనుమతించకపోవడంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు. చిరంజీవి తన ప్రసంగంలో విశాఖ నగరంతో ఉన్న అనుబంధం పంచుకున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్‌ సమంత, ఈ చిత్రంలోని నటవర్గం, సాంకేతిక బృంద సభ్యులు పాల్గొన్నారు. సుమ తన వ్యాఖ్యానంతో అలరించారు. పలువురు సాంస్కృతిక కార్యక్రమాలతో మెప్పించారు.