ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలి
ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలి
ఆర్వోలకు కలెక్టర్ భాస్కర్ సూచన
శాసనమండలి స్థానాల ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
రిటర్నింగ్ అధికారులంతా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కె.భాస్కర్ సూచించారు.
భారత ఎన్నికల సంఘం అధికారులు దిల్లీ నుంచి సోమవారం సాయంత్రం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు
నిర్వహించారు.
ఈ కార్యక్రమం తర్వాత కలెక్టర్ భాస్కర్ జిల్లాకు చెందిన ఆర్వోలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుది అనుబంధ ఓటరు జాబితాల తయారీ, ఆన్లైన్,
ఆఫ్లైన్ ద్వారా అందుతున్న దరఖాస్తులు, అభ్యంతరాలు,
క్లెయింల పరిష్కారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్నికల నిర్వహణ సామగ్రి పంపిణీ, స్వీకరణకు కౌంటర్ల ఏర్పాటు, ఈవీఎంలను భద్రపర్చేందుకు స్ట్రాంగు రూమ్ల
ఏర్పాటు, ఓట్ల లెక్కింపునకు చేయవల్సిన గ్యాలరీలు,
స్టేబుళ్ల ఏర్పాటు, తదితర అంశాలను ప్రణాళికాబద్ధంగా చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆర్ఒలు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలన్నారు.
సమీక్షలో జేసీ సృజన, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్,
జేసీ2 ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.