మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం
మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం
మంత్రి కళా వెంకట్రావు
విద్యుత్తు బీసీ ఉద్యోగుల దైనందిని ఆవిష్కరణ
ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే : మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం
విద్యుత్తు బీసీ ఉద్యోగుల దైనందిని, క్యాలెండర్ ఆవిష్కరణల కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ
మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది.
రాష్ట్ర విద్యుత్తు బీసీ ఉద్యోగుల 13వ వార్షికోత్సవం సందర్భంగా 2019 సంవత్సరం దైనందినిని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా
శ్రీనివాసరావు, నూతన క్యాలెండర్ను రాష్ట్ర విద్యుత్తు శాఖమంత్రి కిమిడి కళా వెంకట్రావులు ఆవిష్కరించారు.
విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ
షిఫ్ట్ ఆపరేటర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అందరూ అంకితభావంతో విద్యుత్తు శాఖ ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్ర, దేశ అభివృద్ధికి పాల్పడేలా అసోసియేషన్లు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
దేశంలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.
విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్తు ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినందుకు మంత్రి
కళా వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగులకు ఈపీఎఫ్, జీపీఎఫ్ ఇచ్చేందుకు మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ క్రిమిలేయర్ విధానాన్ని పునఃపరిశీలించాలన్నారు.
సభలో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు తన పాటలతో ఉద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపారు.
ఈ సందర్భంగా ప్రసాదరావును మంత్రి కళా వెంకట్రావు చేతుల మీదుగా సత్కరించారు.
విశాఖ ఎస్ఈ సూర్యప్రకాశరావు, విద్యుత్తు డైరెక్టర్లు టి.వి.ఎస్.చంద్రశేఖర్, ఆదామ్, జె.వి.రావు,
విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు యు.శ్రీనివాసులు, నాయకులు సోమశేఖర్, గుణవంతుడు,
సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దఎత్తున బీసీ ఉద్యోగులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావును ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.