News

Realestate News

మా కోసం.. మేమే

For us

మా కోసం.. మేమే

కిచెన్‌ గార్డెన్లో బాలికల ప్రత్యేకత

ఏడాది కిందట ఐటీడీఏ ఆధ్వర్వంలో వసతిగృహాల్లో ఉద్యానవనశాఖ సహకారంతో కిచెన్‌గార్డెన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూరగాయలు పండించుకుని వాటిని వసతిగృహాల్లో వినియోగించుకోవడం ఇందులో ముఖ్యోద్దేశం.. అది కూడా రసాయనాలు లేకుండా పెంచడం ప్రత్యేకత. ఈ ఆలోచనకు ముందే ఇక్కడి విద్యార్థినులు ఆ వైపుగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి వివిధ రకాల కూరగాయల్ని పండించడంలో ప్రత్యేకతను చూపుతున్నారు.

పరిశుభ్రత వారి పనే.: ఉపాధ్యాయుల చొరవతో తెల్లవారు జామున విద్యార్థినులు లేచి డార్మిటరీలతో పాటు, పాఠశాల, వసతిగృహాల పరిశుభ్రత చేస్తారు.  కూరగాయల్ని పండిస్తున్న ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంలోనూ, మొక్కలకు నీరందించడంలోనూశ్రద్ధ వహిస్తున్నారు. కాయగూరలను స్వయంగా ఏరి తీసుకుని వచ్చి వంటశాలకు అందిస్తున్నారు..

ఏడాదిగా పూల పెంపకం: కూరగాయల సాగులో మొదటి నుంచి ఆసక్తి చూపుతున్న విద్యార్థినులకు ఏడాది కిందట ఇక్కడికి ప్రధానోపాధ్యాయురాలిగా వచ్చిన సంధ్యారాణి ప్రోత్సాహం మరింత తోడయ్యింది. పాఠశాల, కార్యాలయం, తరగతి గదుల చుట్టూ పూల మొక్కలను పెంచుతున్నారు. పూల వనాల పెంపకంతో పాఠశాలకు సరికొత్త రూపును తీసుకొచ్చారు. ఇక్కడి విద్యార్థినులు.

ఏమేం పండిస్తున్నారంటే?: ఏదో ఒక రకానికి పరిమితం కాలేదు ఇక్కడి విద్యార్థినులు. వంకాయలు, టమోటాలు, బెండకాయలు, ఆనపకాయలు, క్యాప్సికామ్‌, కాలీఫ్లవర్‌, బుట్ట, జొన్న ఎన్నులు, ముల్లంగి ఇలా దాదాపు పది రకాల కూరగాయలను రెండు ఎకరాల్లో పండిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం వసతిగృహ అవసరాలకే వినియోగిస్తున్నారు. రసాయనాలు లేకుండా పండించడంతో వీటి వల్ల ఎంతో ఆరోగ్యం కూడా చేకూరుతుందని విద్యార్థినులు వివరిస్తున్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo