మార్చి 1 నుంచి ప్రత్యేక రైళ్లు
మార్చి 1 నుంచి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సంబల్పూర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక వారాంతపు సువిధ రైలుతో పాటు సికింద్రాబాద్-గువాహటి-సికింద్రాబాద్ మధ్య వారాంతపు రైలు నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ రామ్మోహన్రావు తెలిపారు.
* సంబల్పూర్-యశ్వంత్‌పూర్(82831): ఈ సువిధ రైలు మార్చి 1 నుంచి జూన్ 28 వరకూ ప్రతి బుధవారం ఉదయం 9.30 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 7 గంటలకు విశాఖ వస్తుంది. మళ్లీ 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది
* యశ్వంత్‌పూర్-సంబల్పూర్(82832): ఈ రైలు మార్చి 3 నుంచి జూన్ 30 వరకూ ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 12.30గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, అదేరోజు రాత్రి 8.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అక్కడి నుంచి 8.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.35 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది.
* ఈ రైలుకు ఒక సెకెండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ, 10 స్లీపర్, 2 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ రెండో తరగతి కమ్ లగేజి బోగీలు ఉంటాయి. ఈ రైలు బరగఢ్ రోడ్, బొలంగీర్, టిట్లాగఢ్, కశింగ, రాయగడ, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, కృష్ణరాజపురం మధ్య రాకపోకలు సాగిస్తుంది.
* సికింద్రాబాద్-గువాహటి(07149): ఈ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30వ తేదీ వరకూ ప్రతి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 8.35 విశాఖ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 8.55 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు గువాహటి చేరుకుంటుంది.
* గువాహటి-సికింద్రాబాద్(07150): ఈ రైలు ఏప్రిల్ 10 నుంచి జులై 3 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 5.25 గంటలకు గువాహటిలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి 5.35గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
* ఈ రైలుకు ఒక సెకెండ్ ఏసీ, 3 థర్ü్డ ఏసీ, 12 స్లీపర్, 2 సెకెండ్ క్లాస్ సీటింగ్ కమ్ లగేజీ బోగీలతో నడుస్తుంది. విజయవాడ, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, బరంపూర్, ఖుర్ధారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, కామాఖ్య మీదుగా రాకపోకలు సాగిస్తుంది.