మార్చి నాటికి ‘బహిరంగ విసర్జన రహిత జిల్లా’గా విశాఖ
మార్చి నాటికి ‘బహిరంగ విసర్జన రహిత జిల్లా’గా విశాఖ
వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖపట్నంను వచ్చే ఏడాది మార్చి నాటికి ‘బహిరంగ విసర్జన రహిత జిల్లా(ఓడీఎఫ్)’గా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ సమావేశమందిరంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. ఉక్కు మనిషి లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి కూడా ఇదే రోజు కావడంతో ఆయన చిత్రపటానికి కూడా పూలదండ వేసి నివాళి అర్పించారు.
కలెక్టర్‌తో పాటు జేసీ సృజన, ఉప కలెక్టర్లు సత్తిబాబు, ప్రమీలాగాంధీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి బి.ఎస్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛతలో ముందంజలో ఉంచాలని, ఓడీఎఫ్‌గా తీర్చి దిద్దే ప్రక్రియను ఈ రోజునుంచే ప్రారంభిస్తున్నామని, దీనిలో అంతా పాల్గొనాలని కోరారు.