News

Realestate News

మహానగరిలో… మరో పోరు…

31-05-2016 vizagrealestate news

ఏసీఏ-వీడీసీఏ వేదికపై భారత్‌-కివీస్‌ మధ్య వన్డే మ్యాచ్‌
అభిమానులకు క్రికెట్‌ పండగ

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: నెలక్రితం ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పండగ చేసుకున్న క్రికెట్‌ అభిమానులకు మరో తీపి కబురు. అక్బోబరు 29న నగరంలోని పోతినమల్లయ్యపాలెంలో గల ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరగనుంది. న్యూజిలాండ్‌ మన దేశ పర్యటనలో భాగంగా అయిదు వన్డేలు ఆడనుండగా.. ఆఖరి వన్డేను విశాఖలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రకటించింది. దీంతో అటు అభిమానుల్లోను, ఇటు క్రికెట్‌ సంఘ ప్రతినిధుల్లోనూ ఎనలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. మ్యాచ్‌ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 1988లో విశాఖ వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు రెండున్నర దశాబ్ధాల తరువాత తిరిగి ఇక్కడకు వస్తోంది. భారత జట్టు విజయాల నాయకుడు ధనాధన్‌ ధోనీ, స్టార్‌ క్రీడాకారుడు విరాట్‌ కోహ్లీ, చూడముచ్చటైన షాట్లు కొట్టే రహానే , సునాయాసంగా సిక్సర్లు బాదే శిఖర్‌ధావన్‌, తికమక బంతులతో వికెట్లకు గిరాటేసే అశ్విన్‌లు మన జట్టులో రానుండగా, కివీస్‌ జట్టు సారథి విలియమ్‌సన్‌, సిక్సర్లు, బౌండరీలు బాదుతూ ఆకట్టుకునే మార్టిన్‌ గప్తిల్‌, రాస్‌ టేలర్‌, నిప్పులు చెరిగే బంతులు వేసే టి.బౌల్ట్‌, టిమ్‌సౌథీ, ఆల్‌రౌండరు కోరె ఆండర్‌సన్‌ తదితర క్రీడాకారుల ఆటను తనివితీరా చూసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

నగరంలో ఇప్పటి వరకు జరిగిన వన్డే మ్యాచ్‌లు
ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లు
* 1998-డిసెంబరు 10- భారత్‌-న్యూజిలాండ్‌

* 1994- నవంబరు 7- భారత్‌-వెస్టిండీస్‌

* 1996- ఫిబ్రవరి 23- ఆస్ట్రేలియా-కెన్యా (ప్రపంచకప్‌ మ్యాచ్‌)

* 1999- మార్చి 27- శ్రీలంక- పాకిస్థాన్‌

* 2001 – ఏప్రిల్‌ 3- భారత్‌-ఆస్ట్రేలియా

పీఎం పాలెం ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగిన మ్యాచ్‌లు

* 2005- ఏప్రిల్‌ 5- భారత్‌-పాకిస్థాన్‌

* 2007- ఫిబ్రవరి 17- భారత్‌- శ్రీలంక

* 2010 – అక్టోబరు 20- భారత్‌- ఆస్ట్రేలియా

* 2011 – డిసెంబరు 2- భారత్‌-వెస్టిండీస్‌

* 2013 – నవంబరు 24- భారత్‌-వెస్టిండీస్‌

* 2014 – అక్టోబరు- భారత్‌-వెస్టిండీస్‌(హుద్‌హుద్‌ వల్ల రద్దు)

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo