మరింతగా అందుబాటులోకి మరో 6 కొత్త రైళ్లు
మరింతగా అందుబాటులోకి మరో ఆరు
వాల్తేరు డివిజన్ పరిధిలోని రైళ్ల కోసం ఉన్న డిమాండ్లపై తూర్పుకోస్తా రైల్వే స్పందించింది. తాజాగా ఆరు కొత్త రైళ్లను, మరో ఆరు రైళ్లను ప్రయాణికులకు మరింతగా అందుబాటులో ఉండేలా కీలక ప్రతిపాదనలను ఇండియన్ రైల్వే టైమ్‌టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ)కి అందించింది. అధికారిక సమాచారం ద్వారా ఈ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
* విశాఖ నుంచి వారణాసి.. వయా రాయపూర్, బిలాస్పూర్, అలహాబాద్ (వారానికి రెండుసార్లు)
* విశాఖ నుంచి బెంగళూరు.. వయా విజయవాడ, రేణిగుంట, తిరుపతి, కట్పాడి, జోలార్‌పేట (రోజూ)
* విశాఖ నుంచి గుంటూరు.. వయా విజయవాడ (రాత్రిపూట)
* విశాఖ నుంచి తిరుపతి.. వయా విజయవాడ, గూడూరు (రోజువారీ)
* విశాఖ నుంచి చెన్నై సూపర్‌ఫాస్ట్ (రాత్రిపూట)
* విశాఖ నుంచి అజ్మీర్ సూపర్‌ఫాస్ట్
మరింతగా అందుబాటులోకి…
* 22203/22204 విశాఖ-సికింద్రాబాద్ (వారానికి మూడుసార్ల నుంచి రోజువారీ)
* 12807/12808 విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి నుంచి మూడుసార్లు)
* 22847/22848 విశాఖ-ఎల్టీటీ (వారానికి ఒకసారి నుంచి మూడుసార్లు)
* 18503/18504 విశాఖ-సాయినగర్ షిర్డి (ప్రస్తుతం వారానికి ఒకసారి)
* 18567/18568 విశాఖ-కోల్లాం (ప్రస్తుతం వారానికి ఒకసారి)
* 18501/18502 విశాఖ-గాంధీధామ్ (ప్రస్తుతం వారానికి ఒకసారి)
స్టాప్ల ప్రతిపాదనలు
* 18519/18520 విశాఖ-ఎల్టీటీ రైలును దువ్వాడలో కూడా ఆపాలని ప్రతిపాదించారు.
* 12665/12666 హౌరా-కన్యాకుమారి, 12841/12842 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను విజయనగరంలో కూడా ఆపాలని ప్రతిపాదించా
త్వరలోనే సమావేశం…
తూర్పుకోస్తా రైల్వే పంపిన ప్రతిపాదనల్ని ఐఆర్టీటీసీ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ త్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశంలోని అన్ని జోన్లలో రైళ్ల సమయాలు, కొత్తరైళ్లు, ఇదివరకు ఉన్న రైళ్ల విస్తరణ, స్టాపింగుల మార్పు తదితర అంశాల మీద ఈ కమిటీ అంతర్గతంగా లోతుగా చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది. వాల్తేరు విషయానికొస్తే.. తూర్పుకోస్తా రైల్వే ప్రతిపాదించినవాటిల్లో విశాఖ-అజ్మీర్ నూతన రైలు మినహా మిగిలినవన్నీ పాతవే. గత రెండు ఐఆర్టీటీసీ సమావేశాలుగా ఇవి పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని ఆమోదించుకునేందుకు మరోసారి జోన్ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి.రు.