News

Realestate News

మన్యంలో మే పుష్పాల కనువిందు

చింతపల్లి, న్యూస్‌టుడే: మన్యంలో మే పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ఒక మే పుష్పాన్ని చూస్తేనే ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది. అటువంటిది పదుల సంఖ్యలో మే పుష్పాలన్నీ ఒకే చోట ఉంటే ఇక చెప్పేదేముంది. ఒక్క మే నెలలో మాత్రమే పుష్పించే ఈ పుష్పాలను మొట్టమొదట మన్యానికి పరిచయం చేసిన ఘనత చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలదే. సిమ్లా, వూటీ, డార్జిలింగ్‌ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ మే పుష్పాన్ని కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ శీతల వాతావరణంలో పెరుగుతుందా? లేదా అన్న విషయంపై పరిశీలించేందుకు కొన్ని విత్తనాలను తీసుకువచ్చి నాటారు. అనూహ్యంగా ఇవి ఇక్కడ వాతావరణంలో చక్కగా పెరగడం మొదలు పెట్టాయి. ఇలా కాలక్రమంలో మన్యం అంతటా మే పుష్పాలు విస్తరించాయి. ఒకే చోట కనువిందు చేస్తున్న ఈ మే పుష్పాలు చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు పంచాయతీ కేంద్రంలోనివి.

Source : http://www.eenadu.net/