News

Realestate News

మంత్రి వద్దకు సస్పెన్షన్‌ ప్రతిపాదనలు


మంత్రి వద్దకు సస్పెన్షన్‌ ప్రతిపాదనలు,/h2>

అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే :

ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సస్పెన్షన్‌కు ప్రతిపాదనలు డీఈఓ నుంచి కలెక్టర్‌ వద్దకు వెళ్లగా ఆయన మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుకు పంపించారు.

దీంతో బుధవారం మంత్రి గంటా అందుబాటులోకి రాకపోవటంతో గురువారం ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తెలిపారు.

అయితే పీఆర్‌టీయూ, ఏపీసీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బుధవారం డీఈఓ కార్యాలయానికి  తరలివచ్చారు.

సీపీఎస్‌పై మద్దతు తెలపాలని కోరేందుకే ఉపాధ్యాయులు జగన్‌ పర్యటనకు వెళ్లారని..

దీనికే చర్యలు ఏమిటని వినతిపత్రాలు అందించారు.

డీఈఓకు వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కోరుకొండ సతీష్‌, రొంగలి అప్పలరాజు, గాడి సూర్యప్రకాష్‌, కాశీ విశ్వేశ్వరావు, గోపీనాథ్‌ తదితర ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo