భారత్ బెంజ్ బస్సు ఆవిష్కరణ

విశాఖసాంస్కృతికం, న్యూస్‌టుడే:
భారత్ బెంజ్(డామ్లల్ ఇండియా) సంస్థ వినియోగదారులకు చెన్నైలోని ప్లాంట్‌లో తాజాగా పాఠశాల బస్సులు, ఇంటర్ సిటీ బస్సులను కూడా తయారుచేసి అందిస్తోందని వరుణ్‌మోటార్స్ జి.ఎం. వి.వి.రాజేంద్ర పేర్కొన్నారు. భారత్ బెంజ్ మొదటి వాహనాన్ని నగరంలోని ఆర్ణవ్ ట్రావెల్స్‌కు మంగళవారం వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్దేవ్తో కలిసి ఆయన అందజేశారు. బెంజ్ బస్సులు 26 నుంచి 50 సీట్లతో ఏసీ, నాన్ఏసీ విభాగాల్లో లభ్యమవుతున్నాయని రాజేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఈడీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.