భారత్లో పెరిగిన కరోనా ఉధృతి.. గడచిన 24 గంటల్లో..
భారత్లో పెరిగిన కరోనా ఉధృతి.. గడచిన 24 గంటల్లో..

corona cases has been increased in india
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయి.
గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,881 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 3,66,946కి చేరినట్టు తెలిపింది.
ప్రస్తుతం 1,60,384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 1,94,325 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు గత 24 గంటల్లో మరో 334 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 12,237కు పెరిగింది.