భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఏయూ ప్రాంగణం: మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏయూలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన భవనాల పునర్నిర్మాణాలకు రూ.100 కోట్లు అవసరమన్నారు. ఈ భవనాలకు పూర్వ స్థితిని తీసుకువచ్చేందుకు ఆధునికీకరించాల్సి ఉందన్నారు. ఏయూ అకడమిక్ సెల్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని వీసీÔ ప్రకటించారు. వర్శిటీ ప్రధానాచార్యులు, విభాగాధిపతులతో వీసీÔ ఆచార్య నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన, పరిశోధనల కోసం ఈ తరగతి గదుల నిర్మాణం నిర్మిస్తామన్నారు. ప్రతి విభాగంలోను పూర్తిస్థాయిలో ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. వర్శిటీతోపాటు అనుబంధ కళాశాలల్లోను విద్యను మరింత చేరువ చేస్తామన్నారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని అక్టోబరు 12న నిర్వహిస్తామని తెలిపారు. భారీస్థాయిలో ఈ ఏడాది పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తామని దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హజరవుతారని తెలిపారు. పూర విద్యార్థులు వర్శిటీ ప్రగతికి కృషి చేయాలని వీసీÔ పిలుపునిచ్చారు.