News

Realestate News

భద్రత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

vizagnews

పరవాడ, న్యూస్‌టుడే :

       విశాఖను అత్యంత భద్రత నగరంగా తీర్చిదిద్దడానికి త్వరలో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ అన్నారు. ఫార్మాసిటీ రాంకీ కమర్షియల్‌ హబ్‌లో సోమవారం ఆయన రాంకీ సిబ్బందితో పాటు ఫార్మా యాజమాన్యాలతో సమావేశమయ్యారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2012లో సేప్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించారన్నారు. అదే తరహాలో విశాఖలో అన్ని సంస్థల సహకారంతో సిటీ సెక్యూటరీ కౌన్సిల్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా క్రైం, ట్రాఫిక్‌, లాండ్‌ ఆర్డర్‌ తదితర సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని, ఈ విధానం అందరికీ మేలు చేస్తుందన్నారు. అనంతరం రాంకీ అవుట్‌పోస్టు వద్ద సీపీ మొక్కలను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో రాంకీ సీఈవో లాల్‌ కృష్ణ, జేఎన్‌పీసీ సీఏవో నాగరాజు, సౌత్‌ ఏసీపీ రామ్మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo