News

Realestate News

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధిస్తాం

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధిస్తాం
కాగడాల ప్రదర్శనతో ఆందోళన
నెహ్రూచౌక్‌(అనకాపల్లి),న్యూస్‌టుడే: భగత్‌సింగ్‌ స్ఫూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. పట్టణంలోని నెహ్రూచౌక్‌ కూడలిలో శుక్రవారం రాత్రి భారత స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్‌సింగ్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చే వరకు పోరాటం కాగడాలతో ప్రదర్శన చేస్తూ పెద్దగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి సహాయ కార్యదర్శి కె.సురేష్‌బాబు, సీపీఐ  నాయకులు వైఎన్‌.భద్రం, మాధవరావు, దొరబాబు, ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు జాజుల రమేష్‌, మామిడి నూకరాజు, ఏఐవైఎఫ్‌ నాయకులు రాజా హరీష్‌, జనసేన పార్టీ నాయకులు శ్రీరామదాసు గోవింద, దూలం గోపి, రాము, ఆళ్ల ప్రవీణ్‌, వేలం నూకరాజు తదితరులు పాల్గొన్నారు.