బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: కేబుల్ రంగంలో హెచ్.డి. ఛానళ్ల ద్వారా ప్రసారాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందిన జి.టి.పి.ఎల్. వాజీ కమ్యూనికేషన్స్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్నామని ఆ సంస్థ ఎం.డి. జి.శ్రీనివాసరావు చెప్పారు. గురువారం ఎంవీపీకాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో వుడా వీసీ డాక్టర్ బాబూరావునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి, జి.టి.పి.ఎల్., వాజీ కమ్యూనికేషన్ü్స అందిస్తున్న బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించారు. అధ్యక్షత వహించిన వాజీ కమ్యూనికేషన్ü్స ఎం.డి. శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బ్రాడ్ బ్యాండ్ ప్యాకేజీలు అందుబాటులో ధరల్లో ఉంచామన్నారు. మార్కెట్లో ఎవరూ ఇవ్వలేని స్పీడ్‌తో తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అంతర్జాల సేవలను అందిస్తున్నామన్నారు. వుడా వీసీ డాక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ జి.టి.పి.ఎల్. వాజీ కమ్యూనికేషన్ü్స ద్వారా నేటి అవసరాలకు తగినట్లుగా బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అంతర్జాల సేవలను అందించటం అభినందనీయమన్నారు. వీటెల్ ప్రాంతీయ మేనేజర్ చంద్రశేఖర్, వైటీవీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, వాల్తేరు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ఎం.డి. శాండియ్య, జి.టి.పి.ఎల్. బ్రాడ్‌బాండ్ జి.ఎం.మనోజ్నాయర్, కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు దివాకర్, డైరెక్టర్లు వర్మ, విక్రమ్, సీతారామరాజు, ఇతర కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.