బ్రాండిక్స్ ద్వారా మరింత మందికి ఉపాధి

సంస్థ మేనేజింగ్ భాగస్వామి దొరస్వామి
సెజ్ (అచ్యుతాపురం), న్యూస్టుడే: బ్రాండిక్స్ అపెరల్ సిటీ ద్వారా స్థానికంగా మరింత మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అపెరల్ సిటీ ఇండియా మేనేజింగ్ పార్టనర్ దొరస్వామి ప్రకటించారు. గురువారం ఆయన అపెరల్ సిటీ పరిధిలోని పరిశ్రమలను పరిశీలించారు. కంపెనీ ఉత్పత్తులను పరిశీలిస్తూనే నేరుగా ఉద్యోగినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు అందిస్తున్న సేవలపై ఉద్యోగినులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగినులతో కలిసి క్యాంటీన్ భోజనం చేస్తూ వారితో ముచ్చటించారు. గర్భిణులతో మాట్లాడి వారికి కంపెనీ ఏర్పాటుచేస్తున్న పోషకాహారాన్ని రుచిచూశారు. చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించి కొద్ది సేపువారితో గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బ్రాండిక్స్ సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూనే మరింత మందికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్ సీఈఈ రఘుపతి, ఉన్నత ఉద్యోగులు అష్తోష్గంజూ, భాస్కర్, శ్రీరామ్, శశివర్దన్, జగన్, శంకర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.