News

Realestate News

బొర్రాగుహలకు జనకళ

Development works groundbreakings

బొర్రాగుహలకు జనకళ
ఒక్కరోజే 9వేల మంది పర్యటకుల సందర్శన
రికార్డు స్థాయిలో ఆదాయం రూ. 6.3లక్షల ఆదాయం
అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రముఖ పర్యటక కేంద్రం బొర్రాగుహలు ఆదివారం జనకళను సంతరించుకున్నాయి. బొర్రాగుహల అందాలను తిలకించడానికి రికార్డు స్థాయిలో 9 వేలమంది పర్యటకులు తరలివచ్చారు. ఒక్కరోజులోనే ప్రవేశ రుసుం ద్వారా సుమారు రూ 6.3 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్‌ మేనేజరు బద్రి తెలిపారు. కార్తీకమాసంలో నిత్యం పర్యటకులతో రద్దీగా ఉండే సమయంలో పెద్దనోట్ల రద్దు ప్రభావం కనిపించగా.. శనివారం నుంచి భారీగా పర్యటకులు వస్తున్నారు. ఘాట్‌ రోడ్డంతా వాహనాలతో రద్దీగానే ఉంది.