News

Realestate News

బొర్రాకు పోటెత్తారు

బొర్రాకు పోటెత్తారు
అనంతగిరి, అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి మండల పరిధిలోని పర్యటక కేంద్రాలను సందర్శించేందుకు పర్యటకులు పోటెత్తారు. డముకు, గాలికొండ వ్యూపాయింట్‌తో పాటు కటికి, తాటిగుడ జలపాతాల వద్ద పర్యటకుల రద్దీ పెరిగింది. బొర్రా గుహలను ఆదివారం ఒక్కరోజే 5 వేల మందికిపైగా సందర్శించారు. సుమారు రూ.3 లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని గుహల యూనిట్‌ మేనేజరు బద్రి తెలిపారు. కాఫీ తోటల సమీపంలో మంచు అధికంగా కురుస్తుండటంతో మంచులో ఫొటోలు దిగేందుకు పర్యటకులు ఆసక్తి చూపారు.

జలపాతాలకు సంక్రాంతి శోభ: జి.మాడుగుల: కొతపల్లి జలపాతం పర్యటకులతో కళకళలాడింది. సంక్రాంతి సెలవులు, ఆదివారం కనుమ పండగ కావడంతో ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్య పర్యటకులు తరలివచ్చారు. దీంతో జలపాతం పరిసరాలు సందడిగా మారాయి. మన్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటం, జలపాతాల్లో నీరు చల్లగా ఉండటంతో ఆ నీటిలోనే చలికి వణుకుతూ స్నానాలు ఆచరిస్తూ సందడి చేశారు.

చాపరాయి జలవిహారిలో..: డుంబ్రిగుడ: చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యటకుల సందడి నెలకొంది. సంక్రాంతి పండగ వేళ పర్యటకుల రద్దీ పెరిగింది. అంజోడ స్కిల్‌ఫాం సందర్శించి జలవిహారిలో స్నానాలు ఆచరించారు. గిరిజన మహిళల థింసా నృత్యాన్ని వీక్షిస్తూ ఆనందంగా గడిపారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo