News

Realestate News

బే మారథాన్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం

Vizag Real Estate News

విశాఖపట్నం, న్యూస్‌టుడే: జులైన 2న దేశంలోనే తొలిసారిగా సాయంత్రం వేళ విశాఖ సాగరతీరంలో నిర్వహించనున్న బే మారథాన్‌ వెబ్‌సైట్‌ను సీఎం చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలో ఆవిష్కరించారు. డీప్‌ సేవా సంస్థ, జిల్లా యంత్రాంగం సహాయంతో దీన్ని నిర్వహిస్తోంది. మూడు విభాగాల్లో మారథాన్‌ పరుగును నిర్వహిస్తారు. www.-vizagbaymarathon.com వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. మారథాన్‌లో పాల్గొనదల్చే వారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సంకల్పబలంతో నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతాయన్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్న డీప్‌ సేవా సంస్థ నిర్వాహకులను సీఎం అభినందించారు. సంస్థ ప్రతినిధి డాక్టర్‌ నన్నపనేని మురళీధర్‌, కలెక్టర్‌ యువరాజ్‌, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo