బే మారథాన్ టీషర్ట్ ఆవిష్కరణ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: జులై 2న బీచ్‌రోడ్డులో నిర్వహిస్తున్న బే మార్‌థాన్‌కు సంబంధించిన టీషర్ట్‌ను గురువారం ఓ హోటల్లో కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖలో తొలిసారిగా వైజాగ్ స్టీల్ బే మార్థాన్ పేరిట రాత్రిపూట పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. విశాఖ నుంచే 3వేల మంది సభ్యులు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో డీప్ సంస్థ ఛైర్మన్ కె.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.