బీచ్ రోడ్లో వాక్‌థాన్

బీచ్‌రోడ్, (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: బీచ్ రోడ్లో శనివారం ఉదయం వాక్‌థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళికాదేవి ఆలయం నుంచి వైఎంసీఏ వరకు విద్యార్థులతో జరిగిన ఈ నడక కార్యక్రమంలో యుఎన్ భారత్, భూటాన్ ఇన్ఫర్మేషన్ అధికారి రాజీవ్చంద్రన్ పాల్గొన్నారు. ఆగస్టులో జరగనున్న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు కార్యక్రమంలో భాగంగా యస్ వుయికెన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు, ఆచార్య కె.శివరామకృష్ణ, ఆచార్య హరిప్రకాష్, పోలీసు అధికారి రఘవీర్ విష్ణు, ఎస్.అనురాగ్ పాల్గొన్నారు.