బాలికా..మేలుకో!
కౌమార దశ బాలికలకు సదస్సులు
‘కిశోరి వికాసం’ పేరుతో శిక్షణ
రోలుగుంట, న్యూస్టుడే

బాలికల హక్కులను గుర్తించగలిగినపుడు, వారి అవసరాలను తీర్చగలిగినపుడు, వారు చెప్పేవి వినగలిగినపుడు, బాలికలు వారి కుటుంబాలనూ, తద్వారా సమాజాన్నే మార్చగలుగుతారు. ఎందుకంటే ఈ విశ్వాన్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలు వారిలోనే ఉన్నాయని
అనుభవజ్ఞుల భావన.
చదువుతోపాటు క్రీడా, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాలన్నింటిలో పురుషులకు దీటుగా యువతులు పోటీపడుతున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమించడంలో సైతం నేడు ముందుంటున్నారు. తద్వారా వారి తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఆర్థికంగా భరోసాగా నిలుస్తున్నారు. అయితే ఇంకా చాలామంది బాలికలు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. కౌమార దశలో వారి ఆలోచనా విధానం సరిగా లేకపోవడంతో చదువులకు మధ్యలో స్వస్తి చెప్పే దుస్థితి నెలకొంది. బాల్యంలోనే వివాహాలు చేసుకోవడం, గర్భం దాల్చడం, ఫలితంగా రక్తహీనత, పౌష్ఠికాహార లోపాలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని బడిలోని, బడిబయట బాలికలకు ‘కిశోరి వికాసం’ పేరుతో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తూర్పుగోదావరి జిల్లాలో 2016లో ప్రయోగాత్మకంగా ‘కిశోరి వికాసం’ పథకాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ సఫలీకృతులవడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఇంటర్మీయట్ ఆర్యోగ విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్, సాంకేతిక విద్య, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, పాఠశాల ఉన్నతవిద్య తదితర శాఖలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్) సమన్వయంతో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. దీని అమలు కోసం ఆయా.. ప్రాంతాల్లోని డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ చదివే యువతులను ఎంపికచేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతోంది. వీరిద్వారా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, వసతిగృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు తర్ఫీదు ఇప్పిస్తున్నారు.
ఎందుకోసం ఈ వికాసం?
కౌమార దశలో ఉన్న బాలికల్లో ఆరోగ్య, భౌతిక పరమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ దశలో కిశోరి బాలికలు తోటివారి నుంచి, సమాజం నుంచి పలు రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. ఈ సమయంలో బాలికలకు ఆరోగ్యం, పోషణ, జీవనవిధానంపై అవగాహన, ఆచరణ విధానం ఎంతో అవసరం. అందుకు తరగతి ఉపాధ్యాయులతోనో, నిష్ణాతులైన అనుభవజ్ఞులతోనో చెప్పిస్తే మరలా అదోరకమైన పాఠంగానే భావించే అవకాశముంది. అందుకే ఉన్నత విద్యా కళాశాలల్లో చదువుతున్న అమ్మాయిల ద్వారానే అవగాహన కలిగించాలని యోచించారు. దీనికోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా పథకానికి రూపకల్పన చేశారు. బీ మన రాష్ట్రంలో 60శాతం మహిళల్లో (15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపువారిలో) రక్తహీనత సమస్య.బీ ప్రతి ముగ్గురు అమ్మాయిల్లోనూ ఒక్కరు మాత్రమే (34.3.శాతం) పదో తరగతి, ఆపై చదువులను పూర్తి చేస్తున్నారు
.బీ నేటికీ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు (32.7 శాతం) 18 ఏళ్లకంటే ముందే వివాహం చేసుకుంటున్నారు.బీ 43శాతం మంది మహిళలు గృహహింస (భర్త, అత్తమామలు) వేధింపులకు గురవుతున్నారు.
ప్రధాన లక్ష్యాలు: ఆరోగ్యం, పోషణ, మానసిక వికాసం, అమ్మాయిల్లో యుక్త వయసులో వచ్చే మార్పులు, సామాజిక అంశాలైన బాల్యవివాహాలు, మహిళలపై హింస, మహిళల అక్రమ రవాణా (ఛైల్డ్ ట్రాఫికింగ్) తదితర అంశాలపై అవగాహన.బీ జీవన లక్ష్యాలను నిర్దేశించడం, ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన, కిశోరి బాలికలకు జీవన నైపుణ్యాలను వివరించి వారి వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలా తయారుచేయడం.బీ వారికోసం ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు, చట్టాలను వివరించడం, ఆత్మసంరక్షణ, లైంగికపరమైన వివక్ష, దాడులకు గురికాకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలను వివరించడం.బీ రాష్ట్రంలో బడిలో చదువుతున్న 15.96లక్షల మంది కిశోరి బాలికలకు శిక్షణ ఇవ్వడం. బీ బడిబయట ఉన్న 2.60లక్షల మంది కిశోరి బాలికలకు శిక్షణ.
అమలు చేసేదెలా?
జిల్లాస్థాయిలో అమలు చేసేందుకు మోనిటరింగు కమిటీని ఏర్పాటు చేయాలి.బీ ఎంతమంది కిశోరి బాలికలకు శిక్షణ అనే వివరాలను అంచనా వేయాలి.బీ శిక్షణ ఇచ్చేందుకు కళాశాలల నుంచి ఉత్సాహవంతులైన విద్యార్థునులను పీటీజీ (పీర్ గ్రూప్ ట్రైనర్స్)లుగా ఎంపిక చేయాలి.
* జిల్లాస్థాయి రిసోర్స్ గ్రూపు సభ్యులను ముందుగానే ఎంపికచేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. బీ పీటీజీలకు డివిజన్ స్థాయిలో రెండురోజుల శిక్షణ నిర్వహించాలి. బీ శిక్షణ పొందిన పీటీజీలు కిశోరి బాలికలకు పాఠశాల స్థాయిలో నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలి. బీ ఆరునెలల తరువాత రెండు రోజుల శిక్షణ ఇవ్వాలి. బీ జిల్లా పరిధిలోని 166 బాలికల విద్యాలయాల్లో యునిసెఫ్, జిల్లా బాలల సంరక్షణ కేంద్రం సమన్వయంతో అవగాహన కల్పించాలన్నది లక్ష్యం. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు 56 విద్యాలయాల్లో చదువుతున్న 11-18 సంవత్సరాల్లోపు వయసున్న 11,984 మంది బాలికలకు శిక్షణ పూర్తిచేశారు. మిగిలిన విద్యాలయాల్లోనూ దశలవారీగా ఈ శిక్షణను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించారు.
నర్సీపట్నం డివిజన్ పరిధిలోని నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, గొలుగొండ, కోటవురట్ల, మాకవరపాలెం, రోలుగుంట తదితర ప్రాంతాల్లోని బాలికల విద్యాలయాల్లో ఈ అవగాహన తరగతులను నిర్వహించారు. ఈ ప్రాంతంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, బాలికల జూనియర్ కళాశాలలు, బీసీ, ఎస్సీ వసతి గృహాల బాలికలు, గురుకుల బాలికల విద్యాలయాల్లో సుమారు 114 మంది పీర్ గ్రూపు ట్రైనర్ల ద్వారా డివిజన్ పరిధిలో 2978 బాలికలకు అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలతోపాటు ప్రయివేటు కాలేజీలైన ఎబిఎం, శ్రీవిద్య, డాన్బాస్కోస్, రిషీ, జైఅరుణా తదితర కాలేజీల్లోనూ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో బాలికల్లో తరచూ వేధించే సబెక్టుపరమైన సందేహాలు, వ్యక్తిగత సమస్యలను అధిగమించడం, ఆర్థిక, సామాజిక సమస్యలను తెలుసుకుని వాటిని సరైన రీతిలో మార్గాలను తెలియజేసి తగిన సూచనలు, సలహాలను అందిస్తున్నారు.
ఆత్మవిశ్వాసం పెంచడానికి అవకాశం
సాధారణంగా ఉపాధ్యాయులతో చెప్పించే ప్రక్రియ అయితే పిల్లల్లోకి చొచ్చుకుని వెళ్లే అవకాశాలు తక్కువ. అందుకే ఈ అవకాశాన్ని మాకు అప్పగించడం వల్ల ప్రతీ బాలికనూ ఓ సోదరిలా భావించి నేటి సమాజాన్ని పీడిస్తున్న అనేక రుగ్మతలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలా పదిమందికి బోధించడం వల్ల వారితోపాటు మేమూ చైతన్యం పొందుతున్నాం. దీనివల్ల మాకు స్టేజ్ ఫియర్ దూరమై నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాం.
ఆందోళన దూరమై ప్రశ్నించగలిగే ధైర్యం
కిశోరి వికాసం పేరుతో ఇలా తోటి బాలికలకు చైతన్యం కల్పించడం వల్ల వారిలో ఆందోళన దూరమవుతుంది. తద్వారా ఎదుటివారిని ప్రశ్నించే ధైర్యం కలుగుతుంది. కౌమారదశలోని బాలికలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అదే స్ఫూర్తితో మరో పదిమందికి చెప్పగలిగే శక్తి కలుగుతుంది.
పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపు
గతంలో ఎన్నడూ ఈ తరహా శిక్షణా తరగతులను నిర్వహించలేదు. పలు శాఖల సమన్వయంతో ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఈ విధానం బాలికలకు ఎంతో ప్రయోజనకరం. వారిలో దృఢమైన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. తద్వారా అటు సబ్జెక్టుపరంగానూ ఇటు మానసికంగానూ సరైన ఎదుగుదలకు దోహదపడుతుంది.
భవిష్యత్తు నిర్ణయానికి దిక్సూచి
ప్రాథమిక విద్య తరువాత బాలికలకు ఉన్నత చదువుల కోసం సరైన సలహాలు, సూచనలు ఇచ్చేవారులేక ఎంతో నష్టపోతుంటారు. సరైన అవగాహన లేక తల్లిదండ్రులు, బంధువులు, సామాజిక, కుటుంబ బాధ్యతల కారణంగా కొందరు చదువులకు మధ్యలోనే స్వస్తి చెప్పేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేటి సమాజంలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. అలాంటివి నివారించడానికి కిశోరి వికాస పథకం దోహదపడుతుంది. బాలికల బంగారు భవితకు దిక్సూచి అవుతుంది. రానున్న రోజుల్లో మిగతా విద్యాలయాల్లో శిక్షణ తరగతులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.