News

Realestate News

బాలల స్నేహపూర్వక జిల్లాగా మారుద్దాం: కలెక్టర్‌

Child-friendly district lets

బాలల స్నేహపూర్వక జిల్లాగా మారుద్దాం: కలెక్టర్‌
ఏయూ ప్రాంగణం : విశాఖను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దడంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కోరారు. ఛైల్డ్‌లైన్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన ‘బాలల హక్కుల సాధన 2017 సంవత్సర’ క్యాలెండర్‌ను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. బాలల హక్కుల సాధన, అభివృద్ధి బాధ్యతలను బాలల సంఘాలు వహించి వారితో స్నేహపూర్వకంగా మెలగుతూ సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. ఛైల్డ్‌లైన్‌ ప్రొటెక్షన్‌ ఫోరం నగర కన్వీనర్‌ సీతారం ఇతర ప్రతినిధులను అభినందించారు. సంయుక్త కలెక్టర్‌ జె.సృజన మాట్లాడుతూ పోక్సో చట్టంపై బాలల సంఘాలు, ప్రభుత్వ శాఖల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాయింటü కలెక్టర్‌-2 డి.వెంకటరెడ్డి, డి.ఆర్‌.ఒ.చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షులు నాగేశ్వరరరెడ్డి, ప్రతినిధులు పి.సత్యకుమార్‌, టి.హరి, డి.శకుంతల, శంకరరావు, రాము, మల్లేశు తదితరులు పాల్గొన్నారు.