News

Realestate News

బాలలపై లఘుచిత్ర నిర్మాణం

బాలలపై లఘుచిత్ర నిర్మాణం
సినీ నటి రోజారమణి
సింహాచలం, న్యూస్‌టుడే: బాలలపై సందేశాత్మకమైన లఘు చిత్రం తీయాలని ఉందని సినీ నటి రోజారమణి అన్నారు. గురువారం ఆమె అప్పన్నస్వామిని దర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ రోజుల్లో భక్త ప్రహ్లాద తరహాలో ఆధ్యాత్మిక లఘుచిత్రాలు తీయడం సాధ్యం కాదన్నారు. అందుకే బాలలపై సందేశాత్మకమైన లఘు చిత్రం నిర్మిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. పాత సినిమాలే మంచివని చెప్పడానికి వీల్లేదని ఈ రోజుల్లో కూడా మంచివి వస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందించే నంది అవార్డులపై మాట్లాడుతూ.. ఈ పురస్కారాలు మూడేళ్లకోసారి ఇవ్వడం వల్ల చాలామంది కళాకారుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఏటా వీటిని అందిస్తే ప్రోత్సహించినట్లు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఆమె అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాదుడి విగ్రహానికి తులసి మాలలు వేశారు. రోజా రమణితోపాటు ఆమె భర్త చక్రపాణి, సామవేద ఆధ్యాత్మిక ప్రవచనాల సంఘం ప్రతినిధి బండి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo