News

Realestate News

బాక్సింగ్‌ పోటీల విజేత విశాఖ జట్టు

బాక్సింగ్‌ పోటీల విజేత విశాఖ జట్టు
విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే:
రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలు ఆదివారం రాత్రి డీఎల్‌బీ మైదానంలో ముగిశాయి. టోర్నీలో విశాఖ జిల్లా జట్టు టీం ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఆ జట్టు బాలుర విభాగంలో 56, బాలికల విభాగంలో 27 పాయింట్లు సాధించింది. ద్వితీయ స్థానాల్లో బాలుర విభాగంలో 26 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు, బాలికల విభాగంలో 8 పాయింట్లతో నెల్లూరు జట్టు నిలిచాయి. విజేత జట్లకు భాజపా నాయకులు చొక్కాకుల వెంకట్రావు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బాక్సింగ్‌ క్రీడలో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ స్థానం విశాఖదేనని కొనియాడారు. క్రీడాకారులు మరింత కష్టపడి ఆడుతూ విజయపథంలో దూసుకుపోవాలన్నారు. పతకాలు గెలుపొందే క్రీడాకారుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వేచిచూస్తున్నాయన్నారు. సిటీ బాక్సింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు అమ్మోరు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఎ.పి.బాక్సింగ్‌ సంఘం అధ్యక్షుడు, నగర టాస్క్‌ఫోర్సు ఏసీపీ ఐ.చిట్టిబాబు, కార్యదర్శి రవిరాజు, జిల్లా బాక్సింగ్‌ సంఘం కార్యదర్శి బి.అప్పన్నరెడ్డి, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo