బడుగుల సంక్షేమానికి ప్రజాశాంతి కృషి
బడుగుల సంక్షేమానికి ప్రజాశాంతి కృషి
బడుగుల సంక్షేమానికి ప్రజాశాంతి కృషి
ప్రజాశాంతి పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని,
ఈ విషయం మంగళవారం నగరంలో విడుదల చేస్తున్న తమ పార్టీ మ్యానిఫెస్టో చూస్తే అర్ధమవుతుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కె.ఎ.పాల్ పేర్కొన్నారు.
రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి
వస్తే రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా విద్య, కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు.
తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇప్పటికే పలువురు వ్యక్తులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుతున్నారని పేర్కొన్నారు.
తాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నానని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు.
నగరానికి చెందిన పలువురు వ్యక్తులు పార్టీలో చేరడంతో పాల్ వారిని సాదరంగా ఆహ్వానించారు.