News

Realestate News

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించాలి: మంత్రి గంటా


ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించాలి: మంత్రి గంటా

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ కాన్వొకేషన్‌ హాల్లో శుక్రవారం సాయంత్రం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల నిర్వహణ బాధ్యతలతో పాఠశాల అభివృద్ధి

చెందుతుందన్నారు.

తెదేపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యాశాఖకు అధిక నిధులు కేటాయిస్తూ,

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

ఇంత చేసినా… విద్యార్థుల నమోదు శాతం తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతంలో ప్రధానోపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు.

ఆరో తరగతి నుంచి 9 తరగతి విద్యార్థులకు 60 రోజుల కార్యక్రమాన్ని రూపొందించామని,

దాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు.

పదో తరగతి విద్యార్థుల ప్రిపరేషన్‌కు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

అనంతరం మంత్రిని మూడు జిల్లాల డీఈవోలు,

ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సన్మానించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు,

ఆర్‌జేడీ దేవానందరెడ్డి, డీఈవోలు  (విశాఖ) లింగేశ్వరరెడ్డి, విజయనగరం డీఈవో జి.నాగమణి,

పాడేరు ఐటీడీఏ డీఈవో ఎం.జ్యోతికుమారి, శ్రీకాకుళం డీఈవో బి.విజయభాస్కర్‌, పీవో వి.సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo