ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక హంగులు
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక హంగులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జాతీయ ఆరోగ్య మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ అనిల్ తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ వైద్యాలయాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, విశాఖపట్నంలోని పలు ఆసుపత్రులను ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. విశాఖ జిల్లాలో అనకాపల్లి, అగనంపూడి ఆసుపత్రులను ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్యులు, టెక్నీషియన్ పోస్టులు ఔట్ సోర్సింగ్‌లో భర్తీచేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ నాయక్, ఎన్టీఆర్ ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ కుమారి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రియదర్శిని పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/