ప్రపంచ బ్యాంకు నిధులతో కైలాసగిరి అభివృద్ధి
ప్రపంచ బ్యాంకు నిధులతో కైలాసగిరి అభివృద్ధి
సమగ్ర పథక నివేదిక తయారీకి ఒప్పందం
ఈనాడు, విశాఖపట్నం: ప్రపంచ బ్యాంకు నిధులతో కైలాసగిరి అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన బృహత్తర ప్రణాళిక తయారీకి అవసరమైన సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) రూపొందించే బాధ్యతను అహ్మదాబాద్‌కు చెందిన సాయి కన్సల్టింగ్ సంస్థకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం సోమవారం వుడా కార్యాలయంలో వీసీ బసంత్‌కుమార్, సంస్థ ఛీప్ ఆపరేటింగ్ అధికారి నితిన్‌షా సమక్షంలో జరిగింది. ఆరునెలల్లో ఈ డీపీఆర్ సమర్పించాల్సి ఉంది. కార్యక్రమంలో వుడా కార్యదర్శి శ్రీనివాస్, సీఈ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.