News

Realestate News

ప్రధాన శాస్త్రవేత్త జమునకు ఉద్యోగోన్నతి

ప్రధాన శాస్త్రవేత్త జమునకు ఉద్యోగోన్నతి
విజయనగరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త పి.జమున ఉద్యోగోన్నతిపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ‘అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌’గా వెళ్తున్నారు. ఈమె శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గల వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ సంస్థలపై ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బుధవారం పరిశోధనా స్థానంలో తోటి శాస్త్రవేత్తలు, సిబ్బంది అభినందించారు. మూడు జిలాల్లో రైతాంగానికి అనువైన పరిశోధనలు చేసి ఉత్తర కోస్తా అభివృద్ధికి తోడ్పాడాలని, ఇందుకు అందరూ కలిసి పనిచేయాలని ఆమె సూచించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo