ప్రధాని ఓ బహుమతి, రాహుల్ ఓ ఫన్ మెషీన్
ప్రధాని ఓ బహుమతి, రాహుల్ ఓ ఫన్ మెషీన్

బోఫాల్:ప్రధాని ఓ బహుమతి, రాహుల్ ఓ ఫన్ మెషీన్..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని మోదీ మీద పొగడ్తల వర్షం కురిపించారు.
ఆయన దేశ ప్రజలకు లభించిన ఓ బహుమతి అని అభివర్ణించారు.
‘ప్రజలు ఆయన్ను ఎంతో గౌరవంతో చూస్తారు. ఆయన దేశ ప్రజలకు దేవుడిచ్చిన బహుమతి’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో ప్రధాని లేక ముఖ్యమంత్రి ఎవరి పేరు మీద ముందుకెళ్లనున్నారని ప్రశ్నించగా..
‘ప్రధాని ఆశీస్సులు, మద్దతు మాకు బలాన్ని చేకూర్చుతాయి’ అని వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఎదురవుతోన్న పోటీ గురించి వెల్లడిస్తూ..
‘రాహుల్ ఒక ఫన్ మెషీన్. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు.
ఒక జాతీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఆయనలో కనిపించవు’ అని విమర్శించారు.
రఫేల్ వివాదం మధ్యప్రదేశ్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపదని, మోదీ సమగ్రత మీద ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.
భాజపా నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిమిత్తం చౌహాన్ ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు.
ఈ సమావేశానికి ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారు.