News

Realestate News

ప్రత్యేక హోదా కోసం అందరి మద్దతు కూడగట్టాలి


ప్రత్యేక హోదా కోసం అందరి మద్దతు కూడగట్టాలి

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

సింహాచలం, న్యూస్‌టుడే:ప్రత్యేక హోదా కోసం అందరి మద్దతు కూడగట్టాలి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కూడగట్టి, పటిష్ఠ పోరాటం చేయాల్సిన

అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు అభిప్రాయ పడ్డారు.

శనివారం సింహాచలం వచ్చిన ఆయన అప్పన్న స్వామిని దర్శించుకుని,

అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు

గమ్మత్తుగా మారాయన్నారు. నాయకులు ఇంట్లో ఒకమాట బయటో మాట మాట్లాడుతూ ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రత్యేక హోదాపై చట్టం చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

వాళ్లు చట్టం చేయకుండా నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తెదేపా ఆధ్వర్యంలో ధర్మ పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్రం

స్పందించడం లేదన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo