News

Realestate News

ప్రత్యేక రైళ్ల కాలం పొడిగింపు

The extension of the period of special trains, vizagrealestate

డాబాగార్డెన్స్‌ :

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం, తిరుపతి, సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ యల్వేందర్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖపట్నం-తిరుపతి-విశాఖ సువిధా : 82851 – విశాఖపట్నం-తిరుపతి వారాంతపు సువిధా ప్రత్యేక రైలు ఈ నెల 21 నుంచి డిసెంబరు 26 వరకు ప్రతి సోమవారం రాత్రి 10.55 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
82852 – తిరుపతి-విశాఖపట్నం వారాంతపు సువిధ ప్రత్యేక రైలు ఈ నెల 22 నుంచి డిసెంబరు 27 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మర్నాడుదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఒక సెకెండ్‌ ఏ.సి, 3 థర్డ్‌ ఏ.సి, 9 స్లీపర్‌ క్లాస్‌, 6 సాధారణ రెండోతరగతి, 2 రెండోతరగతి కమ్‌ లగేజి బోగిలతో ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూగుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తీ, రేణుగుంటల మీదుగా తిరుపతి-విశాఖ స్టేషన్‌ల మధ్య రాకపోకలు సాగిస్తుంది.

విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం : 08501 – విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబరు 22 నుంచి డిసెంబరు 27 వరకు ప్రతి మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

08502 సికింద్రాబాద్‌-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబరు 23 నుంచి డిసెంబరు 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు తెల్లవారుజామున 4.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఒక సెకెండ్‌ ఏ.సి, 3 థర్డ్‌ ఏ.సి, 10 స్లీపర్‌ క్లాస్‌, 6 సాధారణ రెండోతరగతి, 2 రెండో తరగతి కమ్‌ లగేజి బోగిలతో ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, ఖాజీపేట మీదుగా సికింద్రాబాద్‌-విశాఖ స్టేషన్‌ల మధ్య రాకపోకలు సాగిస్తుంది.

పాండిచ్చేరి-సంత్రగచ్చి-పాండిచ్చేరి: 06010 – పాండిచ్చేరి-సంత్రగచ్చి వారాంతపు ప్రత్యేక రైలు నవంబరు 19 నుంచి డిసెంబరు 31 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7.15 గంటలకు పాండిచ్చేరిలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1.43 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 1.45 గంటలకు బయలుదేరి మర్నాడు తెల్లవారుజామున 4.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది

06009 – సంత్రగచ్చి-పాండిచ్చేరి వారాంతపు ప్రత్యేక రైలు నవంబర్‌ 21 నుంచి జనవరి 2 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2.10 గంటలక సంత్రగచ్చిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 3.55 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 3.57 గంటలకు బయలు దేరి అదే రోజు రాత్రి 8.15 గంటలకు పాండిచ్ఛేరి చేరుకుంటుంది.

ఒక సెకెండ్‌ ఏ.సి, 1 థర్డ్‌ ఏ.సి, 7 స్లీపర్‌ క్లాస్‌, 6 సాధారణ రెండో తరగతి, 2 రెండో తరగతికమ్‌ లగేజి బోగిలతో ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బరంపూర్‌, ఖుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, బద్రక్‌ స్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు.

విశాఖ- కొల్లాం-విశాఖ సువిధకు అదనపు హాల్ట్‌లు: 82855-82856 విశాఖ-కొల్లాం-విశాఖ మధ్య నడిచే సువిధ ప్రత్యేక రైలుకు తుని, తిరువల్ల, చెన్నగనూర్‌ రైల్వే స్టేషన్లలో స్టాపేజ్‌ కల్పిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ యల్వేందర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రయాణికులు గమణించి ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo