News

Realestate News

ప్రతిభ గల విద్యార్థులకు సత్కారం

ప్రతిభ గల విద్యార్థులకు సత్కారం
కొత్తూరు (నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: కొత్తూరు ఏఎంఏఏ ఉన్నత పాఠశాలలో ఈఏడాది పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలో సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈఏడాది ఫలితాల్లో 9.8 గ్రేడు పాయింట్లు 15 మంది, 9 పైగా గ్రేడు పాయింట్లు 66 మంది విద్యార్థులు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగుపాం నాగేశ్వరరావు తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన కొయిలాడ సాయికుమార్‌, బి.లావణ్య, ఆడారి చంద్రశేఖర్‌, సాయికుమార్‌లకు వర్తక సంఘం అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ జ్ఞాపికలతో అభినందించారు. హెచ్‌ఎం మాట్లాడుతూ గత పదేళ్లగా పది పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు, ప్రతి ఏడాది రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న ప్రతిభ అవార్డుకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు ఏఆర్‌ఎల్‌.నర్సింగరావు, కరస్పాండెంట్‌ జి.సత్యసురేష్‌, ఉపాధ్యాయులు కె.లావణ్య, బి.ఉమామహేశ్వరి, మదీనా పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo