News

Realestate News

ప్రకృతి సేద్యంలో ఏపీ టాప్‌: చంద్రబాబు

ప్రకృతి సేద్యంలో ఏపీ టాప్‌: చంద్రబాబు

1

న్యూయార్క్‌: ప్రకృతి-సేద్యంలో-ఏపీ-టాప..రైతులకు ఖర్చును తగ్గించి చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐరాస సదస్సులో కీలకోపన్యాసం చేశారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు.

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక-బ్లూంబెర్గ్‌ నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు.

పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు.

ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo