News

Realestate News

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
అనకాపల్లి, న్యూస్‌టుడే: నేల, నీరు, గాలి కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సత్యనారాయణ అన్నారు. స్థానిక రైతుశిక్షణ కేంద్రంలో ఆదివారం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న జిల్లాస్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారధాన్యాలు, పండ్ల, కూరగాయలలో కలిగి ఉన్న పురుగు మందుల అవశేషాలు ద్వారా ప్రజలపై విష ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు వంటివి రైతులకు సకాలంలో అందివ్వాలని చెప్పారు. ప్రారంభంలో సాంకేతిక లోపాలు సహజమన్నారు.

ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలేకాని రైతులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. రైతు శిక్షణ కేంద్రం ఉపసంచాలకురాలు ఎన్‌. గీతాశైలజ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్‌ సమస్యను రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని వివరించారు. కొంతమంది యువరైతులు ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు చేస్తూ లాభాలు పొందుతున్నారన్నారు. దీన్ని ఇతర రైతులు ఆచరించేలా మండల వ్యవసాయాధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సంచాకుడు కె.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. రైతు ఆడారి అప్పారావు మాట్లాడుతూ ప్రతి రైతు కనీసం ఇంట్లో తినే ఆహార ఉత్పత్తులు అయినా ప్రకృతి విధానంలో పండించుకోవాలన్నారు. జిల్లాలోని వ్యవసాయాధికారులు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo