ప్రకృతి అవెన్యూస్ బేవర్లీ హిల్స్వెంచర్ ప్రారంభం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: ప్రకృతి అవెన్యూస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆనందపురంలో బేవర్లీ హిల్స్ వెంచర్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ హీరో శ్రీకాంత్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తిచేసి వుడా వారి నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులతో సామాన్యప్రజలకు అందుబాటులో నివాసయోగ్యం కల్పించటంలో ప్రకృతి అవెన్యూస్ కృషి చేయటం అభినందనీయమన్నారు. సినీ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖ చాలా అద్భుతమైన నగరంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి నగరంలో సొంతింటిని నిర్మించుకోవటం చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఎం.వి.చౌదరి, ప్రకృతి అవెన్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అంజిబాబు, డైరెక్టర్లు పరశురామ్, కృష్ణకాంత్, ఉపాధ్యక్షులు శంకరరావు, అప్పారావు, జి.ఎం.లు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.