పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలి
పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలి
సివిల్ పోలీసుల పునః శిక్షణలో ఎస్పీ బాబూజీ
పోలీసులు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలనీ ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు.
గురువారం బక్కన్నపాలెంలోని జిల్లా పోలీసుల శిక్షణ కేంద్రంలో 27 మంది సివిల్ పోలీసులకు శిక్షణ ప్రారంభించారు.
నలభై ఏళ్లలోపు ఉన్న పోలీసు సిబ్బందికి ఈ శిక్షణలో శారీరక సామర్థ్యం, ఈత, యోగా, ధ్యానం, చట్టాలపై పునఃశిక్షణ ఇస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదని, ఉద్యోగం, కుటుంబాన్ని సమానంగా చూసుకుంటూ విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
విశాఖ జిల్లా తీర ప్రాంతంలో ఉన్నందున ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసు సిబ్బందికి ఇటువంటి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పోలీస్ సిబ్బంది ఈ పునః శిక్షణా తరగతులకు విధిగా హాజరై శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
దైనందిన జీవితంలో బాగా పనిచేసి పేరు తెచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీటీసీ ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ (పరిపాలన) పి.వి.రవికుమార్, డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ జి.దుర్గాప్రసాద్,
రిజర్వ్ ఇన్స్పెక్టర్ మోహన్, డీటీసీ ఉద్యోగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.