పోలీసులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

పోలీసులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
నర్సీపట్నం, న్యూస్‌టుడే(Health tests for police): నర్సీపట్నం పోలీసు స్టేషన్లో ఆదివారం సబ్‌డివిజన్‌లోని పోలీసులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని
నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టరు ఆర్.వి.కె.చౌదరి పర్యవేక్షణలో ఈ శిబిరం
ఏర్పాటు చేశారు. విశాఖకు చెందిన కేర్ ఆసుపత్రి వైద్యులు, స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టరు దొర, ప్రైవేటు
వైద్యుడు రాజశేఖర్ శిబిరంలో పోలీసుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. నర్సీపట్నం సబ్ డివిజన్లోని కొయ్యూరు, నక్కపల్లి,
ఎలమంచిలి, పాయకరావుపేట, కొత్తకోట తదితర అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని స్థాయిల పోలీసులు హాజరయ్యారు, ఈసీజీ,
మధుమేహం, అధిక రక్తపోటు తదితర అన్ని పరీక్షలను నిర్వహించిన వైద్యులు నివేదికలను పోలీసులకు అందజేశారు.