News

Realestate News

పొత్తు వల్లే అభివృద్ధి కార్యక్రమాలు

పొత్తు వల్లే అభివృద్ధి కార్యక్రమాలు
సొంతబలంతోనే ఎమ్మెల్సీ మాధవ్‌ గెలిచారు
భాజపా సీనియర్‌ నాయకులు చలపతిరావు
మద్దిలపాలెం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో గందరగోళం ఏర్పడడానికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని మాజీ ఎమ్మెల్సీ, భాజపా సీనియర్‌ నాయకులు  పి.వి.చలపతిరావు అన్నారు. బుధవారం పిఠాపురంకాలనీలో తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. చంద్రబాబునాయుడు భాజపాతో పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రం, విశాఖపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను భాజపా చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖలో అనేక విశ్వవిద్యాలయాలను భాజపా హయాంలోనే ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. త్వరలో విశాఖకు రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ప్రకటించనుందన్నారు. తన కుమారుడు మాధవ్‌ భాజపా బలంతోనే గెలిచాడని.. తెదేపా చెప్తున్నట్లు వారి బలంతో కాదన్నారు. విశాఖకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు. బుధవారం నుంచి ఈనెల 30 వరకు సంపర్క్‌ అభియన్‌ పేరిట భాజపా కార్యకర్తలు, నాయకులు వార్డుల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పృధ్వీరాజ్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.వి.నారాయణరావు, ప్రకాశరెడ్డి, విశాఖ మాజీ మేయర్‌ పులుసు జనార్థనరావు, కె.రత్నకుమారి, బుద్ద లక్ష్మినారాయణ, పరశ రామరాజు, పరిమి నాగేంద్ర, సుహాసిని ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo