News

Realestate News

పేద విద్యార్థినికి చేయూత

పేద విద్యార్థినికి చేయూత
నర్సీపట్నం, న్యూస్‌టుడే: వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి  క్లబ్‌ జిల్లా గవర్నర్‌ ఎం.రవికుమార్‌ నిర్వహించిన సందర్శన కార్యక్రమంలో పేద విద్యార్థినికి చేయూత లభించింది. నర్సీపట్నంలోని పెదబొడ్డేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన శీరం మౌనిక పదోతరగతిలో పది గ్రేడ్‌ పాయింట్లను సాధించింది. ఈమె తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మౌనిక ట్రిపుల్‌ ఐటీ చదవాలనే ఉత్సాహం ఉన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగాలేదు. ఈ నేపథ్యంలో ఈమె చదువుకు అవసరమైన సాయం అందించేందుకు క్లబ్‌ ప్రతినిధి వెలగా నారాయణరావు ముందుకు వచ్చారు. ముందుగా మౌనికకు రూ. 36 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు డాక్టరు సీఎస్‌ కుమార్‌, ఉడా రాము, నర్సింహమూర్తి, పాలూరి వెంకటేష్‌, రమావేదీ, జ్యోతి, దేవత అరున తదితరులు పాల్గొన్నారు.