News

Realestate News

పేదల ఆర్థికాభివృద్ధికి కృషి


పేదల ఆర్థికాభివృద్ధికి కృషి

జి.వెంకటాపురం (మాకవరపాలెం), న్యూస్‌టుడే:పేదల ఆర్థికాభివృద్ధికి కృషి..

తెలుగుదేశం ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటూ వారి ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

రాష్ట్రంలో 57 లక్షల మంది అర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

గతనెల 22న తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జి.కోడూరు, జి.వెంకటాపురం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మహిళలతో పాటు ఆటో డ్రైవర్‌

ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అయ్యన్న సోమవారం జి.వెంకటాపురం వచ్చారు.

వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా అందిస్తామన్నారు.

రికి త్వరలో ఇస్తామని తెలిపారు.

మృతి చెందిన వారిలో నలుగురు తెలుగుదేశం పార్టీ క్రియశీలక సభ్యత్వం ఉందని,

[వారికి అదనంగా రూ. 2 లక్షలు పార్టీ నుంచి ఇస్తామని చెప్పారు. 

ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగిపోయిన ఇద్దరు మహిళలకు రూ. 2 లక్షల చొప్పున ఇస్తున్నామన్నారు.

గ్రామంలో 20 ఇళ్లు మంజూరు చేస్తానని అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

అనంతరం రాచపల్లికి చెందిన తెదేపా నాయకులు రుత్తల జోగిపాత్రుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయన నివాసానికి వెళ్లి మంత్రి పరామర్శించారు.

మండల పార్టీ అధ్యక్షులు రుత్తల శేషుకుమార్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు అల్లు రామునాయుడు,

మండల ఉపాధ్యక్షులు వి.వెంకటరమణ, జడ్పీటీసీ సభ్యురాలు కసిపల్లి కుమారి,

తహసీల్దారు వై.శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఉదయశ్రీ పాల్గొన్నారు.
రాచపల్లి (మాకవరపాలెం), న్యూస్‌టుడే:  ఆన్‌రాక్‌ పరిశ్రమ తెరిస్తే అందరికీ మంచిదేనని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

సోమవారం మండలానికి వచ్చిన మంత్రి అయ్యన్న రాచపల్లిలో విలేకర్లతో మాట్లాడారు.

ఆన్‌రాక్‌ పరిశ్రమ నడవాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బాక్సైట్‌ ఖనిజాన్ని బయటకు తీస్తే కొడవళ్లతో నరికేస్తానని వైకాపా అధినాయకుడు వై.ఎస్‌.జగన్‌ అంటుంటే ఇక్కడ

ఉన్న నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు ఆన్‌రాక్‌కు బాక్స్‌ట్‌ను ఇవ్వాలని ఆందోళన చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

నాతవరం మండలం సరుగుడు ప్రాంతం నుంచి బాక్సైట్‌ ఖనిజాన్ని తరలిస్తున్నారని అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు.

పరిశ్రమ నడిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo