పేదరిక నిర్మూలనకు విద్య దోహదం
పేదరిక నిర్మూలనకు విద్య దోహదం..
పేదరిక నిర్మూలనకు విద్య దోహదపడుతుందని బ్రిటీ¨ష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫెÆ్లమింగ్ అన్నారు.
బుధవారం పదోవార్డు పరిధి భానునగర్లో మ్యాజిక్బస్ ఇండియాన్ స్వచ్ఛంద సంస్థను ఆయన సందర్శించారు.
అనంతరం సంస్థ యువతతో ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లినప్పడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు.
ప్రతి విద్యార్థి చదువు కోవడం వలన బాల కార్మికులను నివారించవచ్చునన్నారు.
మ్యాజిక్బస్ సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలు సంతోషంగా ఉన్నాయన్నారు.
సంస్థ రీజనల్ డైరక్టర్ నటాషా రామరత్నం మాట్లాడుతూ సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పోటీలను నిర్వహించగా ఆ పోటీల్లో స్నేహదీప్తి విజేతగా నిలిచింది.
ఆయన సందర్శనలో భాగంగా సంస్థ వలంటీర్లతో కాసేపు ఆటలాడారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.