News

Realestate News

పెను తుపానుగా వాయుగుండం


పెను తుపానుగా వాయుగుండం

తమిళనాడు, కేరళల్లో 24 గంటల్లో భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి

 

దిల్లీ: పెను తుపానుగా వాయుగుండం

అరేబియా సముద్రంలో బాగా బలపడిన వాయుగుండం పెను తుపానుగా విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. రానున్న 24 గంటల్లో ఇది తమిళనాడు,

కేరళతోపాటు పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలోనూ భారీ వర్షాలు కురిపించే అవకాశముందని వివరించింది.

అనంతరం ఇది ఒమన్‌, యెమన్‌ల తీరం వైపుగా కదలనుందని పేర్కొంది.

దీంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ బలగాలకు సూచించినట్లు తీర రక్షణ దళం తెలిపింది.

‘‘లక్షద్వీప్‌, కోచిల్లో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాం.

తుపానును ఎదుర్కొనే సన్నద్ధతను వీటిలో సమీక్షించాం.

మరోవైపు లక్షద్వీప్‌కు చెందిన అన్ని దీవుల్లోనూ ప్రత్యేక విపత్తు సన్నద్ధత సమావేశాలు చేపట్టాం’’అని తీర రక్షణ దళం తెలిపింది.

ఇటు ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది.

ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ అంచనావేసింది.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo