News

Realestate News

పెథాలజీ విభాగ భవనం పునరుద్ధరణ


పెథాలజీ విభాగ భవనం పునరుద్ధరణ

రూ. 1.25 కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రవాస వైద్యుడు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:పెథాలజీ విభాగ భవనం పునరుద్ధరణ

ఆంధ్ర వైద్యకళాశాల పూర్వ విద్యార్థి, అమెరికా దేశంలోని వాషింగ్టన్‌లో స్థిరపడిన హిమటోపెథాలజిస్టు

డాక్టర్‌ పి.రవిశర్మ వైద్యకళాశాల పెథాలజీ విభాగ పునరుద్ధరణకు రూ. 1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు.

2014లో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను ధాటికి భవనంలో అధిక ప్రాంతం దెబ్బతింది.

పైకప్పు పెంకులు ఎగిరిపోయాయి. విభాగంలోపల ఉండే మ్యూజియం, లెక్చర్‌ హాళ్లు, రోగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించే విభాగాలు సైతం దెబ్బతిన్నాయి.

డాక్టర్‌ రవిశర్మ తండ్రి డాక్టర్‌ పి.జగన్నాథరావు వైద్యకళాశాల పెథాలజీ విభాగ అధిపతిగా పనిచేశారు.

దివంగతులైన ఆయనకు వచ్చే ఏడాది మార్చిలో వందో జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారీ మొత్తంలో పెథాలజీ విభాగం కోసం విరాళం ఇచ్చేందుకు దాత ముందుకు వచ్చారు.

డాక్టర్‌ రవిశర్మ భార్య డాక్టర్‌ శేషుశర్మ కూడా ఇక్కడ వైద్య విద్యను అభ్యసించారు.

అంకోసా ద్వారా విరాళ మొత్తాన్ని అందజేయడంతో ఆ వర్గాలు పెథాలజీ భవన పునరుద్ధరణ పనులు చేపట్టాయి.

భవన రూపురేఖలు మార్చడం, దెబ్బతిన్న పైకప్పును సరిదిద్దడం, మ్యూజియం, లెక్చర్‌ హాళ్ల పునరుద్ధరణ, అత్యాధునిక ఫర్నిచర్‌ను సమకూర్చడం తదితర పనులు చేస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు.

భారీగా విరాళమిచ్చిన దాత డాక్టర్‌ రవిశర్మ కోరిక మేరకు ఆయన తండ్రి, వైద్యకళాశాల పూర్వపు ఆచార్యులు

డాక్టర్‌ జగన్నాథరావు పేరును పెథాలజీ విభాగ లెక్చర్‌హాలుకు పెడుతున్నామని తెలిపారు.

పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జనవరి లేదా మార్చిలో పునరుద్ధరించిన భవనాన్ని ప్రారంభిస్తామని ప్రిన్సిపల్‌ వివరించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo