Posted on October 17, 2016 by vijay kumar in Realestate News
పెట్రో వర్సిటీ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన వంగలి ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లాకలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎప్పీ రాహుల్ శర్మ
సబ్బవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 20న పెట్రో వర్సిటీ శంకుస్థాపనకు జిల్లాకు రానున్నారు. సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 201.85 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎంతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 10.45గంటలకు కేంద్రమంత్రులతో కలిసి హెలికాప్టర్లో వంగలి చేరుకుని వర్సిటీకి భూమిపూజ, శంకుస్థాపన చేస్తారు. ఆరిలోవలో ఏర్పాటుకానున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని(స్కిల్ డెవలప్మెంటు ఇనిస్టిట్యూట్) జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. దేశంలోని ప్రజలందరికీ వంట గ్యాస్ అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం వంగలి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు పాల్గొంటారు. ఈ మేరకు శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ రాహుల్‌శర్మ ఆదివారం వంగలి ప్రాంతాన్ని సందర్శించారు. Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399